- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వన్యప్రాణులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వంది: భాస్కర్ నాయుడు
తిరుమలలో భారీ సర్పం భక్తులను భయపెట్టింది. కాలినడక మార్గం గాలిగోపురం సమీపంలో ఏడు అడుగుల భారీ నాగుపాము అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది....

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో భారీ సర్పం (Snake) భక్తులను భయపెట్టింది. కాలినడక మార్గం గాలిగోపురం సమీపంలో ఏడు అడుగుల భారీ నాగుపాము అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణ భయంతో దూరంగా పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది భక్తులను అప్రమత్తం చేశారు. టీటీడీ ఫారెస్ట్ విభాగం ఉద్యోగి భాస్కర్ నాయుడు అత్యంత చాకచక్యంగా పామును పట్టుకున్నారు. జనసంచారం లేని శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో భక్తులు, టీటీడీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. నడక మార్గాల్లో అటవీ జంతువులు, సర్పాలు వచ్చే అవకాశం ఉన్నందున భక్తులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు. ఏదైనా వన్యప్రాణి కనిపిస్తే వెంటనే తమ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని చెప్పారు.
Next Story






