సందిగ్ధంలో Nara Lokesh.. శ్రీకాళహస్తిలో పాదయాత్ర జరిగేనా..?

by Vemula.Srinu Prasad |

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది...

సందిగ్ధంలో Nara Lokesh.. శ్రీకాళహస్తిలో పాదయాత్ర జరిగేనా..?
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. గురువారం ఆయన శ్రీకాళహస్తి సమీపంలో పాదయాత్ర చేశారు. శుక్రవారం శ్రీకాళహస్తిలో లోకేశ్ పర్యటించాల్సి ఉంది. అయితే శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

శ్రీకాళహస్తిలో పాదయాత్రకు నో పర్మిషన్

ఈ నేపథ్యంలో నారా లోకేశ్ పాదయాత్రకు శ్రీకాళహస్తిలో అనుమతి నిరాకరించారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీకాళహస్తిలో పాదయాత్ర చేయవద్దని ఇప్పటికే నారా లోకేశ్‌కు పోలీసులు తెలిపారు. అయితే పాదయాత్రకు అవకాశం ఇవ్వాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి. రామచంద్రాపురం వద్ద సభ నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఈ సభకు కూడా పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. అయితే డీఎస్పీ తీసుకునే నిర్ణయం కోసం టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు.

Next Story