పాఠశాలల్లో మళ్లీ పాత సబ్జెక్ట్: మంత్రి లోకేశ్‌ని అభినందించిన నారా భువనేశ్వరి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-20 11:59:13  IST  )

చిత్తూరు జిల్లా కుప్పం నియోజక వర్గం సామగుట్టపల్లిలోని విలువల బడి కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పాల్గొన్నారు..

పాఠశాలల్లో మళ్లీ పాత సబ్జెక్ట్: మంత్రి లోకేశ్‌ని అభినందించిన నారా భువనేశ్వరి
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా(Chittoor) కుప్పం నియోజక వర్గం సామగుట్టపల్లి(Samaguttapally)లోని విలువల బడి కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ విలువల బడి వ్యవస్థాపకులు లెనిల్‌ని తాను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యత నేర్పించి పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ బడులను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు.

తన చిన్నతనంలో స్కూల్లో మోరల్ సైన్స్ ఒక సబ్జెక్ట్‌గా ఉండేదని, ఇప్పుడు మళ్లీ పాఠశాలల్లో ఆ సబ్జెక్ట్ తీసుకొచ్చిన మంత్రి నారా లోకేష్‌కు తాను అభినందనలు చెబుతున్నానని భువనేశ్వరి తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు క్లోజ్ అనే బోర్డులు పెట్టడం చాలా సంతోషదాయకమని చెప్పారు. నేటి సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయని, టెక్నాలజీని చెడు కోసం ఉపయోగిస్తున్నారని. పిల్లల పెంపకంలో తల్లుల పాత్ర కీలకమైందన్నారు. ‘‘చిన్నతనంలోనే విలువలు, సంస్కారం నేర్పాలి. పిల్లల ఆసక్తి గమనించి అందులో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. నారా లోకేష్ ప్రజాసేవలో బిజీగా ఉండటంలో తమ మనుమడు దేవాన్ష్ చదువు, క్రీడల విషయాలు బ్రాహ్మణినే స్వయంగా చూసుకుంటున్నారు అప్పట్లో చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉండటంతో లోకేష్ పెంపకం బాధ్యత నేనే తీసుకున్నా.’’ అని నారా భువనేశ్వరి తెలిపారు.

Next Story