Bhumana Karunakar Reddy : టీటీడీ నూతన చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి

by Taduka Kalyani |   (  Updated:2023-08-10 10:08:34  IST  )

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు.

Bhumana Karunakar Reddy : టీటీడీ నూతన చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి
X

దిశ, తిరుపతి ; తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఉదయం 9 గంటలకు పద్మావతిపురంలోని ఇంటి వద్ద నుంచి బయలుదేరిన భూమన గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అలిపిరి వద్ద గోపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.అలిపిరి నుంచి తిరుమలకు చేరుకున్నారు.శ్రీవారి ఆలయంలోభూమనకు టీటీడీ జీఈవో సదా భార్గవి స్వాగతం పలికారు. శ్రీవారి ఆలయంలో ఉదయం 11: 44 గంటలకు టీటీడీ చైర్మన్‌గా భూమన ప్రమాణ స్వీకారం చేశారు. భూమన బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో తిరుపతి నగరంలో అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తిరుపతి నగరం గోవిందా నామ స్మరణలతో మారు మ్రోగింది.

Next Story