భవిష్యత్తులో శాస్త్రవేత్తనవుతా.. మిస్ ఇండియా టైటిల్ విన్నర్ భావన

by Dishafeatures2 |
భవిష్యత్తులో శాస్త్రవేత్తనవుతా.. మిస్ ఇండియా టైటిల్ విన్నర్ భావన
X

దిశ, తిరుపతి: ఫ్యూచర్ లో సైంటిస్ట్ అవుతానని మిస్ ఇండియా ఐకానిక్ దివా సీజన్ 3 2023 మిస్ ఇండియా టైటిల్ విన్నర్ భావన తెలిపారు. ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా ముందు తల్లిదండ్రులు గోపికృష్ణ, లక్ష్మి, తమ్ముడు దరహాస్‌లతో కలిసి భావన మాట్లాడుతూ.. తాను ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదువుతున్నానన్నారు. భవిష్యత్ లో సైంటిస్ట్ కావడమే తన లక్ష్యమని తెలిపారు. ఇక భారతదేశం మొత్తం నుండి ఈ టైటిల్ కోసం గత 15 రోజుల కిందట 1000 మంది పోటీపడ్డారన్నారు.

ద్వితీయ స్థానంలో 300 మంది నిలవగా, టాప్ 20లో తాను ప్రవేశించి ముంబైలో గత నాలుగు రోజులు జరిగిన ఫైనల్స్ లో మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. ఈ మిస్ ఇండియా కిరీటాన్ని ఎంజాయ్ చేస్తున్నానని తెలిపారు. గతంలో డైరెక్టర్ శీను దర్శకత్వంలో షార్ట్ ఫిలింలో కూడా నటించానన్నారు. సుప్రజా చౌదరి, కవిత కిషోర్, రియాన్ శర్మలని తనకు రోల్ మోడల్స్ అని చెప్పారు. భవిష్యత్తులో సమాజ సేవ చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు.



Next Story

Most Viewed