- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరిలో 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తా: మంత్రి రోజా
ఎన్నికల్లో 10 వేల మెజార్టీతో గెలుస్తానని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు....

దిశ, వెబ్ డెస్క్: ఈ ఎన్నికల్లో 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. నగరి నుంచి మూడో సారి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆమె నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ తన కష్టాన్ని సీఎం జగన్ గుర్తించారని.. ప్రజలు కూడా అండగా నిలవాలని కోరారు. టికెట్ లేదని ప్రచారం జరిగినా సీఎం జగన్ అండగా నిలవడంతో నామినేషన్ వేశానని చెప్పారు. నగరిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొడతానని రోజా ధీమా వ్యక్తం చేశారు. నగరిలో వెన్ను పోటు రాజకీయాలు చేసే వారున్నారని.. అలాంటి వారికి మే 13న ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రోజా హెచ్చరించారు. సీఎం జగన్ సహకారంలో నగరిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానమి చెప్పారు. నగరిలో రెండు సార్లు గెలిచి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాటం చేశానని రోజా పేర్కొన్నారు.
Read More..






