- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kuppam : రేస్కోలో ప్రస్తుతం ఎలాంటి కొత్త నియామకాలు లేవు
చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఉన్న కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంఘం లిమిటెడ్ (RURAL ELECTRIC CO-OPERATIVE SOCIETY LIMITED - RESCO)లో ప్రస్తుతం ఎటువంటి కొత్త నియామకాలు జరగడం లేదని సంస్థ చైర్మన్ ప్రతాప్ తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఉన్న కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంఘం లిమిటెడ్ (RURAL ELECTRIC CO-OPERATIVE SOCIETY LIMITED - RESCO)లో ప్రస్తుతం ఎటువంటి కొత్త నియామకాలు జరగడం లేదని సంస్థ చైర్మన్ ప్రతాప్ తెలిపారు. రేస్కోలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇటీవల మోసాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ విషయమై రేస్కో చైర్మన్ ప్రతాప్ మాట్లాడుతూ రేస్కోలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు.
అయితే ప్రస్తుతం ఎలాంటి నియామకాలను సంస్థ చేపట్టడం లేదన్నారు. మోసపూరిత మాటలు నమ్మి డబ్బులు ఇవ్వొద్దని కోరారు. డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు (Jobs) పొందవచ్చని ఎవరైనా చెబితే అస్సలు నమ్మొద్దని స్పష్టం చేశారు. లైసెన్స్ లేకుండానే గత ఐదేళ్లలో చాలా నియామకాలు జరిగినట్లు గుర్తించామన్నారు. ఈ నియామకాల (Recruitment) వ్యవహారంలో ఉద్యోగుల ప్రమేయం ఉంటే వారిపై చర్యలు తప్పకుండా ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు కూడా మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.






