- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Padmavati Temple: 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఈ నెల 20న తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 20న తిరుచానూరు పద్మావతి అమ్మవారి(Tiruchanur Padmavati Ammavari) ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. అంతేకాదు 25న రథసప్తమిని వైభవంగా నిర్వహిస్తు్న్నట్లు అధికారులు తెలిపారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(Koil Alwar Thirumanjanam)లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.30 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9.30 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు.
Next Story






