Rocking Rajesh: పెళ్లితో ఒక్కటైన రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత

by Disha Web Desk 16 |
Rocking Rajesh: పెళ్లితో ఒక్కటైన రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత
X

దిశ, డైనమిక్ బ్యూరో: జబర్దస్త్ కమెడియన్‌ రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత వివాహం హైదరాబాద్‌లో కన్నుల పండువగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. . ఈ జంట వివాహానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా దంపతులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వధూవరుల పెళ్లి తంతులో పెద్దలుగా వ్యవహరించారు. అన్నీ దగ్గరుండి రోజా దంపతులు చూసుకున్నారు. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మంత్రి ఆర్‌కే రోజా ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్న ఫోటోలను తన ఫేస్ బుక్ వేదికగా తెలియజేశారు. తనకు అత్యంత ఆప్తుడు, అమ్మా అని పిలిచే రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత జంట నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో వర్ధిల్లాలని రోజా దీవించారు.


కాగా రాకింగ్ రాకేష్ కొన్నాళ్ల నుంచి జోర్దార్ సుజాతతో ప్రేమ‌లో ఉన్నారు. రాకింగ్ రాకేశ్ టీమ్‌లో సుజాత కంటెస్టెంట్‌గా యాక్ట్ చేస్తోంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇటీవలే వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా పెళ్లి చేసుకున్నారు.

Next Story

Most Viewed