- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబద్ధపు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు: మాజీ మంత్రి రోజా హెచ్చరిక
by Vemula.Srinu Prasad |
తిరుపతి గంగమ్మను దర్శించుకున్న అనంతరం మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దొంగ ఈవీఎంలతో కాకుండా నిజాయతీగా ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలోకి రావాలని ఆమె డిమాండ్ చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati) గంగమ్మ(Gangamma)ను దర్శించుకున్న అనంతరం మాజీ మంత్రి రోజా(Former Minister Roja) కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దొంగ ఈవీఎంలతో కాకుండా నిజాయతీగా ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలోకి రావాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించాలే తప్ప, అక్రమ మార్గాల్లో కాదని హితవు పలికారు.
అవమానించడం తగదు
అదేవిధంగా శ్రీవారి లడ్డూ(Srivari Laddu) ప్రసాదంపై వస్తున్న ఆరోపణల పట్ల ఆమె తీవ్రంగా స్పందించారు. అత్యంత పవిత్రమైన లడ్డూను రాజకీయ లబ్ధి కోసం నోటికొచ్చినట్లు విమర్శిస్తూ అవమానించడం తగదని మండిపడ్డారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిపై గానీ, లడ్డూ ప్రసాదంపై గానీ అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Next Story






