- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Municipal Workers: మూడు నెలలుగా జీతాలు అందలేదు
తిరుపతి జిల్లా గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, మున్సిపాలిటీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు పేర్కొన్నారు...

X
దిశ, గూడూరు: తిరుపతి జిల్లా గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట మున్సిపాలిటీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు పేర్కొన్నారు. గూడూరు సీఐటీయూ కార్యాలయం నుంచి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవోతో తమ సమస్యలను చెప్పుకున్నారు. 2005 నుండి పీఎఫ్, ఈఎస్ఐ లెక్కలు మున్సిపాలిటీల్లో లేవని వెల్లడించారు. 2019లో జూన్, జులై, హెల్త్ అలవెన్సులు ఇప్పటివరకు చెల్లించలేదని తెలిపారు. ఇప్పటికి ఏడుగురు కార్మికులకు పది నెలలు జీతాలు పెండింగ్‌లోనే ఉన్నాయని, కార్మికుల పేర్లు ఆప్కాస్‌లో ఎక్కించకుండా గూడూరు మున్సిపల్ కమిషనర్ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story






