- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతిలో రేపు ఎన్నికలు.. ఈసీకి రోజా సంచలన ట్వీట్
తిరుపతి ఉపమేయర్ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి రోజా(Former minister Roja) కోరారు

దిశ, వెబ్ డెస్క్: Elections in Tirupati tomorrowElections in Tirupati tomorrow. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి నీలమ్ సాహ్నికి ట్వీట్ చేశారు. తిరుపతి నగర పాలక సంస్థ ఉప మేయర్ ఎన్నికలు ఈ నెల 3న జరగుతున్నాయని, వైసీపీ అభ్యర్థి శేఖర్ రెడ్డి(Andhra Pradesh Chief Electoral Officer Neelam Sahn)ని మున్సిపల్ సిబ్బంది భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పై స్థాయి అధికారుల ప్రమేయం లేకుండా కింది స్థాయి సిబ్బంది అలా వ్యవహరించలేదని తెలిపారు. ఈ పరిణామం ప్రజ్వామ్యానికి గొడ్డలి పెట్టు అని, ఒక పార్టీ కున్న హక్కును కోల్పోవడమే అవుతుందని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు.
‘‘నిన్న మా అభ్యర్థి శేఖర్ రెడ్డి భాగస్వామిగా ఉన్న నిర్మాణం అనుమతుల విషయంలో లోపాలు చూపుతూ ఎలాంటి ముందస్తు నోటిసులు కూడా ఇవ్వకుండా కూల్చి వేయడానికి పూనుకున్నారు. సుప్రీమ్ కోర్టు ఆదేశాలకు సైతం ఇది ఉల్లంఘించారు. ముందస్తు నోటిసులు, సుప్రీమ్ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని నగర మేయర్ డా శిరీష సూచించారు అయినా మేయర్ సూచనలను కింది స్థాయి అధికారులు లెక్క చేయకుండా వ్యవహరించారు. అంటే ప్రజలు ఎన్నుకున్న మేయర్‌ను అవమానించడం కాదా.?. ఇంత జరుగుతున్నా ఎన్నికల నిర్వహణ ప్రధాన అధికారి జిల్లా కలెక్టర్ గానీ, మున్సిపల్ కమిషనర్ గానీ, మేయర్ ను అవమానించిన సిబ్బంది పై చర్యలు తీసుకోలేదు. ఇలాంటి అధికారులు పర్యవేక్షణలో ఉప మేయర్ ఎన్నిక సజావుగా జరగవు. తమరు జోక్యం చేసుకుని ఎన్నికల విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించని జిల్లా కలెక్టర్, కమిషనర్ పై చర్యలు తీసుకొని వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలి.’’ అని రోజా కోరారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి నీలమ్ సాహ్ని @CEOAndhra గారికి...
— Roja Selvamani (@RojaSelvamaniRK) February 2, 2025
విషయం: తిరుపతి ఉపమేయర్ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా, ప్రశాంత వాతావరణంలో జరగడానికి తమరి జోక్యం నిమిత్తం.
మేడం.. తిరుపతి నగర పాలక సంస్థ ఉప మేయర్ ఎన్నికలు ఈ నెల 3 న జరగుతున్న విషయం తమరికి తెలుసు. మా @YSRCParty…






