- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మన శంకర వరప్రసాద్ సూపర్ హిట్: కూటమి ఎమ్మెల్యే కితాబు
మన శంకర వరప్రసాద్ సూపర్ సక్సెస్ అయిందని కూటమి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు..

దిశ, తిరుపతి ప్రతినిధి: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమా మెగా ఫ్యాన్స్‌కు సంక్రాంతిని రెండు రోజుల ముందే తెచ్చిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. మన శంకర వరప్రసాద్ సినిమాను సోమవారం ఉదయం ఎస్‌వి సినీఫ్లెక్స్‌లో ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి వీక్షించారు. సినిమాలో చిరంజీవి నటన అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. చిరంజీవి ఎంతో ఎనర్జిటిక్‌గా యంగ్‌గా ఈ సినిమాలో కనిపించారని ఆయన చెప్పారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా సినిమా సూపర్ సక్సెస్ అయిందని ఆయన తెలిపారు. చిరంజీవి సినిమాలలో ఎక్కువ కలెక్షన్‌లు రాబట్టిన చిత్రాలలో మన శంకర వరప్రసాద్ నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎస్ కే బాబు, రాజా రెడ్డి, సోమల సురేష్, గంగమ్మ గుడి పాలకమండలి సభ్యులు రుద్ర కిషోర్, దినేష్ జైన్, సుధాకర్, కూరపాటి సురేష్, లక్ష్మీ, ఆనంద్, హేమ కుమార్, శ్రావణ్, కొండా రాజ్ మోహన్, వినోద్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.






