తోక జాడిస్తే కట్ చేస్తాం: సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-02 13:54:16  IST  )

తోక జాడిస్తే కట్ చేస్తామని రౌడీలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు...

తోక జాడిస్తే కట్ చేస్తాం: సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: తోక జాడిస్తే కట్ చేస్తామని రౌడీలకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu Naidu) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన గతంలో ఆ ప్రాంతంలో జరిగిన ఘటనలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎవరైనా సరే రౌడీయిజం చేస్తే అదే వారికి ఆఖరి రోజు అవుతుందని, ఆటలు సాగవ్ అని హెచ్చరించారు. నేరస్థులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. శవ, హత్యా రాజకీయాలు తాను చేయనని స్పష్టం చేశారు. కానీ రాక్షసులపై మాత్రం యుద్ధం చేయాలని చెప్పారు. గత ఐదేళ్లలో రాష్ట్రం విధ్వంసానికి గురైందన్నారు. బీసీల నియోజకవర్గం కుప్పం అని, త్వరలో ఈ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. అలాగే కుప్పం(Kuppam)-హోసూర్‌(Hosur)కు సమాంతరంగా మరో రోడ్డును నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు(Chief Minister Chandrababu) తెలిపారు.

Next Story