స్పిన్ గిఫ్ట్ పేరుతో ఫ్రాడ్.. మదనపల్లెలో 6 వేల మంది నుంచి డబ్బు వసూలు

by Naga Rani Yarlagadda |

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో భారీ మోసం వెలుగుచూసింది. చైన్ లింక్ ఫ్రాడ్ తరహాలో.. స్పిన్ గిఫ్ట్ పేరుతో భారీగా వసూళ్లు చేసి.. పరారయ్యారు.

స్పిన్ గిఫ్ట్ పేరుతో ఫ్రాడ్.. మదనపల్లెలో 6 వేల మంది నుంచి డబ్బు వసూలు
X

దిశ, వెబ్‌డెస్క్: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో భారీ మోసం వెలుగుచూసింది. చైన్ లింక్ ఫ్రాడ్ తరహాలో.. స్పిన్ గిఫ్ట్ పేరుతో భారీగా వసూళ్లు చేసి.. పరారయ్యారు. ఆరా అనే సంస్థ బహుమతులు, నగదు నజరానా పేరుతో ఆకర్షించారు. సుమారు 6 వేల మంది నుంచి డబ్బులు వసూలు చేసి.. కొందరికి స్పిన్ గిఫ్ట్ పేరుతో గిఫ్ట్ లు ఇచ్చి బోర్డు తిప్పేశారు.

రూ.2000, రూ.5400, రూ.20,000 కడితే ప్రతిరోజూ ఆదాయం వస్తుందని నిర్వాహకులు నమ్మించి మోసం చేశారు. మదనపల్లెకు చెందిన మోహన్ బాబు అనే వ్యక్తి స్పిన్ గిఫ్ట్ ద్వారా ల్యాప్ ట్యాప్ లు, ఫోన్లు, కార్లు, టూ వీలర్స్ ఇస్తామని నమ్మించి డబ్బులు కట్టించుకున్నాడు. కొందరికి బహుమతులు ఇచ్చాక.. అతని నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు.. పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ భారీ మోసంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలోనే బాధితులున్నట్లు తెలుస్తోంది. ఆదాయం, కాస్ట్లీ గిఫ్టులు వస్తాయంటే నమ్మి మోసపోయామని, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు.

Next Story