తండ్రి దారుణం: 11 ఏళ్ల క్రితం భార్య.. ఇప్పుడు కూతురు..!

by srinivas |
తండ్రి దారుణం: 11 ఏళ్ల క్రితం భార్య.. ఇప్పుడు కూతురు..!
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం నడింపల్లిలో దారుణం జరిగింది. 14 ఏళ్ల కన్న కూతురిని తండ్రి అత్యంత దారుణం‌గా చంపేశారు. కూతురు మెడకు సెల్ ఫోన్ ఛార్జింగ్ వైర్ బిగించి హత్య చేశారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా కూతురు అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్లాన్ చేశాడు. అయితే స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తండ్రి దారుణం బయటపడింది. నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కూతురు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.


రొంపిచర్ల మండలం చెందిన మునిరత్నం తన 14 ఏళ్ల కూతురితో కలిసి ఉంటున్నారు. ఏమైందో ఏమోగాని కన్న కూతురిని తండ్రి అత్యంత దారుణంగా చంపేశారు. అంతకుముందు 11 ఏళ్ల క్రితం భార్యను కూడా ఆయన అత్యంత పాశవికంగా చంపేశారు. కంటికి రెప్పలా కాపాడుతూ కుటుంబాన్ని పోషించాల్సిన మునిరత్నం క్రూరమృగంలా మారి భార్య, కూతురుని చంపడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే మునిరత్నం తాగుడుకు బానిసై ఈ దారుణానికి ఓడిగట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed