అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి:CDPO

by Jakkula.Mamatha |

అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్ వచ్చింది.

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి:CDPO
X

దిశ,వెబ్‌డెస్క్: అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని చిత్తూరు రూరల్ ప్రాజెక్టు(Chittoor Rural Project) పరిధిలో అంగన్వాడీ పోస్టుల(Anganwadi Post)ను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీవో శ్యామ్ సుగుణ కుమారి తెలిపారు. చిత్తూరు నగరపరిధిలోని జాస్సన్ గార్డెన్‌లో మినీ అంగన్వాడీ కార్యకర్త, లెనిన్ నగర్‌లో సహాయకురాలు, గుడిపాల మండలం రామభద్రపురంలో సహాయకురాలు పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. ఈ నెల(మే) 24తో గడువు ముగుస్తుందని, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను పూర్తి చేసి కొండారెడ్డిపల్లి ప్రాంతంలోని చిత్తూరు ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈ మేరకు సీడీపీవో(CDPO) శ్యావ్ సుగుణ కుమారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story