శ్రీవారి భక్తులకు అలర్ట్.. జూన్ నెల దర్శన కోటా షెడ్యూల్ విడుదల

by Ramesh Naini |

తిరుమల భక్తులకు ముఖ్య గమనిక. జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనార్థం వివిధ సేవా టికెట్లు, దర్శన కోటాను విడుదల చేసేందుకు టీటీడీ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. మార్చి 18వ తేదీ నుండి వరుసగా వివిధ రకాల టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.

శ్రీవారి భక్తులకు అలర్ట్.. జూన్ నెల దర్శన కోటా షెడ్యూల్ విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూన్ నెలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం టీటీడీ కీలక ప్రకటన చేసింది. వివిధ రకాల ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను విడుదల చేసే తేదీలను సోమవారం వెల్లడించింది. మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

మార్చి 18 నుంచి 'లక్కీ డిప్' నమోదు..

సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవా టికెట్ల కోసం మార్చి 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. భక్తులు మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) కోసం నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన వారు మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.

వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల

అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

శ్రీవాణి దర్శన కోటా విడుదల

శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌

తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే తమ టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.

Next Story