శ్రీకాళహస్తిలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేకం

by Thanuru Gopichand |

కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలోని మృత్యుంజయ స్వామి వారికి భక్తి శ్రద్ధలతో అభిషేకం నిర్వహించారు.

శ్రీకాళహస్తిలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేకం
X

దిశ, వెబ్ డెస్క్ : కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలోని మృత్యుంజయ స్వామి వారికి భక్తి శ్రద్ధలతో అభిషేకం నిర్వహించారు. స్వామివారికి పాలు, పెరుగు, పంచామృతం, నెయ్యి, తేనె, విభూది, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పరిమళ పుష్పాలతో స్వామివారిని శోభాయమానంగా అలంకరించి దీప, ధూప, నైవేద్యాలను సమర్పించారు. కర్పూర హారతులిస్తూ మంగళ నీరాజనం పలికారు. భక్తులు అధిక సంఖ్యలో దేవస్థానానికి తరలివచ్చిన స్వామివారిని దర్శించుకున్నారు. శివ నామ స్మరణతో దేవస్థాన ప్రాంగణాన్ని హోరెత్తించి స్వామి అనుగ్రహం కోసం వేడుకున్నారు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న వారు మృత్యుంజయ స్వామివారి అభిషేకంలో పాల్గొంటే వారికి ఆరోగ్యం కుదుటపడుతుందని ప్రతీతి. అందుకే చాలా మంది భక్తులు సోమవారం జరిగే మృత్యుంజయ స్వామి అభిషేకానికి హాజరవుతారు. తమ గోత్ర నామాలతో అర్చన చేయించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు.

Next Story