- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సతీష్ మరణంపై సమగ్ర దర్యాప్తు జరగాలి : భానుప్రకాశ్ రెడ్డి
టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ (AVSO Sathish) మరణంపై సమగ్ర దర్యాప్తు తప్పనిసరిగా జరగాలని బిజెపి నాయకుడు భాను ప్రకాశ్ రెడ్డి (Bhanu Prakash Reddy) డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ (AVSO Sathish) మరణంపై సమగ్ర దర్యాప్తు తప్పనిసరిగా జరగాలని బిజెపి నాయకుడు భాను ప్రకాశ్ రెడ్డి (Bhanu Prakash Reddy) డిమాండ్ చేశారు. సతీష్ ఆకస్మిక మరణంపై ఆయన పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ విషయమై భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ సతీష్ ఆకస్మిక మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. ఒక్కసారిగా తాను దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. సతీష్ ది సహజ మరణం అని చెప్పు కోణానికి సరిపోని అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయన్నారు. సతీష్ సేవలు, పని తీరు గురించి తెలిసిన ప్రతిఒక్కరూ అతని ఆకస్మిక మరణంతో షాక్ కు (Shocked) గురయ్యారన్నారు. గతంలో కూడా భద్రతా సమస్యలు, విచారణ అవసరాలపై టీటీడీ ఉద్యోగులు (TTD Employees) పలుమార్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దాని నేపథ్యంలో సతీష్ మరణంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టీటీడీ వంటి పవిత్రమైన సంస్థల్లో జరిగే ప్రతి కార్యకలాపాల గురించి ప్రజలకు పూర్తి సమాచారం అందించాల్సిన బాధ్యత బోర్డుకు ఉందన్నారు. సతీష్ మరణానికి కారణమైన వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు.






