చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా(Chitttor District)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలం బైరెడ్డిపల్లె వద్ద ఎదురెదురుగా వెళ్తున్న రెండు బైకులు(Bykes) ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా అంచనా వేశారు. మృతులు అస్సాం వాసులుగా గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందజేశారు. గాయపడిన అరుణ్‌కు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా వాహనదారులకు పోలీసులు కీలక విజ్ఞప్తి చేశారు. రోడ్డుపై వాహనాలతో ప్రయాణం చేసేటప్పుడు వేగ నియంత్రణ అవసరమని సూచించారు. కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని డ్రైవర్లు వాహనాలను నడపాలన్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పారు. లేని పక్షంలో కఠిన శిక్షలకు గురవుతారని హెచ్చరించారు.

Next Story