తిరుమలలో చైన్ స్నాచర్ హల్‌చల్‌

by Vemula.Srinu Prasad |

తిరుమలలో చైన్ స్నాచర్ హల్‌చల్‌ చేశారు...

తిరుమలలో చైన్ స్నాచర్ హల్‌చల్‌
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో చైన్ స్నాచర్(Chain Snatcher) హల్‌చల్‌ చేశారు. మాధవ నిలయం(Madhava Nilayam)లో భక్తురాలి(Devotee) మెడలో బంగారు గొలుసు(Gold Chain)ను లాక్కెళ్లేందుకు యువకుడు ప్రయత్నం వేశారు. అయితే భక్తురాలు కేకలు వేయడంతో మిగిలిన భక్తులు చైన్ స్నాచర్‌ను పట్టుకున్నారు. ఘటనా స్థలంలోనే నిందితుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం విజిలెన్స్ సిబ్బందికి అప్పగించారు. దీంతో నిందితుడిని విచారిస్తున్నారు. గత కేసులపై ఆరా తీస్తున్నారు.

తిరుమలలో గతంలోనూ చైన్ స్నాచింగ్స్ జరిగాయి. అయితే అధికారులు ప్రత్యేక టీములు ఏర్పాటు చేశారు. దీంతో కొంతకాలంగా చైన్ స్నాచింగులు జరగడం లేదు. తాజాగా మళ్లీ చైన్ స్నాచర్ హల్ చల్ చేయడంతో భక్తులు హడలిపోతున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాలినడక ప్రాంతంలోనూ ప్రత్యేక నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాలని చెబుతున్నారు.

Next Story