Chittoor: మద్యం మత్తులో కన్నతల్లిపై దాడి.. కానిస్టేబుల్ తల్లి మృతి

by Ramesh Goud |

మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్(Constable) కన్నతల్లి(Mother)పై దాడి(Attack) చేసిన దారుణ ఘటన చిత్తూరు జిల్లా(Chittoor District)లో చోటు చేసుకుంది.

Chittoor: మద్యం మత్తులో కన్నతల్లిపై దాడి.. కానిస్టేబుల్ తల్లి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్(Constable) కన్నతల్లి(Mother)పై దాడి(Attack) చేసిన దారుణ ఘటన చిత్తూరు జిల్లా(Chittoor District)లో చోటు చేసుకుంది. చిత్తూరు పట్టణంలో శంకర్(Shankar) అనే కానిస్టేబుల్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తల్లి వసంతమ్మ(Vasanthamma)తో వాగ్వాదానికి దిగి, ఆమెపైనే దాడి చేశాడు. తాగిన మత్తులో కన్నతల్లి అని చూడకుండా కర్కశంగా కొట్టాడు. మద్యం మత్తులో ఆమెను విపరీతంగా హింసకు గురి చేశాడు. వసంతమ్మ అరుపులు విన్న స్థానికులు ఆమెను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స వసంతమ్మ మరణించింది(Died). ఈ ఘటనపై సమాచారం అందుకున్న చిత్తూరు టూ టౌన్ పోలీసులు(Chittoor Two Town Police) కానిస్టేబుల్ శంకర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story