- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలయ్య ఇలాకాలో పోలీసులపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాడి
సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. కానిస్టేబుల్ పై రెచ్చిపోయాడు.

దిశ, వెబ్‌డెస్క్: సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. కానిస్టేబుల్ పై రెచ్చిపోయాడు. రాష్ట్రంలో కలకలం రేపిన చిలమత్తూరు అత్త, కోడలు గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కావిడి నాగేంద్ర.. సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిపై కత్తితో దాడి చేశాడు. దీంతో వారికి పొట్ట, ఛాతీ, చేతి భాగాలపై గాయాలవ్వగా.. తోటి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కొంతకాలంగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న నాగేంద్ర ఆచూకీ తెలియడంతో.. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీప్రాంతంలో నాగేంద్ర పోలీసులపై తిరగబడగా.. పోలీసులు ఆత్మరక్షణ కోసం రెండుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇంతలో అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ పై దాడి చేయడంతో.. సీఐ ఆంజనేయులు నాగేంద్ర కాలిపై కాల్పులు జరిపారు. సీఐ పై కూడా కత్తితో దాడి చేయడంతో ఇరువురికి గాయాలయ్యాయి. కాలిపై బుల్లెట్ గాయం అవ్వడంతో నాగేంద్ర అక్కడే కుప్పకూలిపోయాడు. సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవి, నిందితుడు నాగేంద్రను ఒకే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. నాగేంద్రపై తెలుగు రాష్ట్రాల్లో 90కి పైగా కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.
2024లో వలస కూలీలపై దారుణం
2024 అక్టోబర్ 12న పొట్టకూటి కోసం కర్ణాటక నుంచి వలస వచ్చిన కూలీలపై కామాంధులు పైశాచికత్వం ప్రదర్శించారు. దసరా పండుగ రోజు జరగిన ఈ దారుణ ఘటన రాష్ట్రంలో సంచలనానికి దారితీసింది. బళ్లారికి చెందిన కుటుంబం మండలంలోని నల్లబొమ్మనపల్లికి వలస రాగా.. తల్లిదండ్రులు, కుమారుడు, కోడలు నిర్మాణంలో ఉన్న ఓ పేపర్ మిల్లులో పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఆ పక్కనే టెంపరరీ రేకుల షెడ్డు వేసుకుని నివసించారు. యథావిధిగా 11న పనులకు వెళ్లి ఇంటి వచ్చి భోజనాలు అయ్యాక తండ్రి, కొడుకు బయట, అత్తా, కోడలు లోపల పడుకున్నారు. తెల్లవారుజామున సుమారు 2.40 గంటల సమయంలో రెండు టూ వీలర్లపై వచ్చిన దుండగులు.. తండ్రి, కొడుకుల్ని చంపుతామని బెదిరించి అత్తా కోడలిపై గ్యాంగ్ రేప్ కు తెగబడ్డారు. శనివారం (అక్టోబర్ 12) పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా.. బాధితులకు హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. ఆ కేసులో ప్రధాన నిందితుడైన నాగేంద్ర 16 నెలలకు పోలీసులకు దొరకడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ వదలకూడదనే పోలీసులు అతనిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.






