నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సందర్శించిన సీఎం జగన్

by Javid Pasha |   (  Updated:2023-05-30 15:47:41  IST  )

మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు మంగళవారం సందర్శించారు.

నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సందర్శించిన సీఎం జగన్
X

దిశ, ఏపీ బ్యూరో : విజయవాడలోని రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం ఉదయం 10.10 గంటల నుంచి 10.40 వరకు అనాధ పిల్లలతో ముచ్చటించి సరదాగా గడిపారు. అంతకుముందు మథర్ థెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అలాగే అక్కడ నూతనంగా నిర్మించిన భవనాన్ని పిల్లలతో కలిసి ప్రారంభించారు. అనంతరం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం చేరుకున్నారు.

Next Story