- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చికెన్.. గుడ్డు.. వైరస్.. వణుకు!
ఏపీని బర్డ్‌ఫ్లూ వణికిస్తోంది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందింది.

దిశ, డైనమిక్‌బ్యూరో : ఏపీని బర్డ్‌ఫ్లూ వణికిస్తోంది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందింది. బర్డ్‌ఫ్లూ సోకిన ఫౌల్డ్రీ నుంచి 10 కిలో మీటర్ల పరిధిని సర్వెలెన్స్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. నిన్న అనుమలంకపల్లిలో 10 వేలకు పైగా కోళ్ల మృత్యువాత పడ్డాయి. ఇవాళ మరో రెండు వేల కోళ్లు మృతి చెందాయి. చనిపోయిన కోళ్లను డిస్సోజ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. వాటిని ఫౌల్డ్రీ యజమానులు పూడ్చి పెడుతున్నారు. మృతి చెందిన కోళ్ల శాంపిల్స్‌ను అధికారులు ల్యాప్‌కు పంపారు. ఆయా ప్రాంతాల్లో మనుషుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలను గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో గోదావరి, ఉమ్మడి కృష్టా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉన్న పిల్లలకు వారం రోజుల పాటు కోడిగుడ్లను అందించడం నిలుపుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
కోళ్లకు వైరస్ సోకడంతో ఫౌల్డ్రీ పరిశ్రమ నష్టాల్లోకి వెళుతోంది. గోదావరి జిల్లాల్లో సుమారు 700 వరకు ఫౌల్డ్రీలు ఉన్నాయి. దాదాపు ఆరు కోట్ల పెట్టుబడితో వ్యాపారులు కోళ్లను కొనుగోలు చేశారు. కనీసం 30 వేల కోళ్లను రోజుకు మాంసం కోసం వినియోగిస్తుంటారు. బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెంది కోళ్లు మృతి చెందడంతో ఒక్కసారిగా ఈ వ్యాపారం కుదేలైంది. మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోకుంటే మరిన్ని నష్టాలు వస్తాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభావంతో చికెన్, గుడ్లు ధరలు భారీగా తగ్గాయి. ఇది వరకు కిలో చికెన్ ధర రూ.220 నుంచి రూ.230 వరకు ఉండగా ప్రస్తుతం రూ.150 నుంచి రూ.170 వరకు విక్రయిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ భయంతో ప్రజలు చికెన్ జోలికి పోవాలంటే ఆలోచిస్తున్నారు.
అయితే ఇక్కడి కోళ్లను గుట్టు చప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం ఆందోళన కలిగిస్తోంది. తణుకు మండలం వేల్పూరు పరిధిలో నిన్న రాత్రి ఓ పౌల్ట్రీ లోని బర్డ్ ఫుల్ సోకిన కోళ్లు మాయం అయ్యాయి. రాత్రికి రాత్రి కోళ్లు ఇతర ప్రాంతాలకు తరలించారు. దీంతో ఇతర ప్రాంతాలకుకు బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు.






