- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా నాన్న, తమ్ముడిని కోల్పోయా.. అలాంటిది ఆ డబ్బులు తీసుకుంటానా: చెవిరెడ్డి భావోద్వేగం
లిక్కర్ స్కామ్ ఆరోపణలపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్(Liquor) అంటేనే తనకు భయమని, అలాంటిది డబ్బులు తీసుకుంటానా అని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Former Mla Chevireddy Bhaskar Reddy) ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ కేసు(Liquor Scam Case)లో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్‌తో తనకు సంబంధం లేదని చెప్పారు. ఆ కేసులో తన గన్ మెన్ తో బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారని ఆరోపించారు. చిన్నోళ్లను ఇబ్బందులు పెట్టొద్దని, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. తమది లిక్కర్ బాధిత కుటుంబమని అని తెలిపారు. తన తమ్ముడు మందు తాగి తాగి లివర్ చెడిపోయి చనిపోయాడని పేర్కొన్నారు. తన తండ్రి తాగుడు అలవాటు వల్ల తమ కుటుంబాన్ని డిస్టబ్ చేశారని, అందువల్ల ఇద్దరిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మందు చూస్తే తాను ఒక రకమైన భావోద్వేగానికి గురవుతానని తెలిపారు. తమ తండ్రి, తమ్ముడిని కోల్పోయిన తాను ఎప్పటికీ లిక్కర్ ముట్టనని చెప్పారు. లిక్కర్‌పై తప్పుడు పనులు ఎప్పుడూ చేయనని స్పష్టం చేశారు. ప్రతిది దేవుడు చూస్తున్నాడని, టీడీపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించారు.






