నన్ను ఇరికించినవారిని వదిలే ప్రసక్తే లేదు : కోర్టు వద్ద చెవిరెడ్డి హైడ్రామా

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-12 09:48:28  IST  )

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam)లో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB Court) ఎదుట హైడ్రామా చేశారు.

నన్ను ఇరికించినవారిని వదిలే ప్రసక్తే లేదు : కోర్టు వద్ద చెవిరెడ్డి హైడ్రామా
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam)లో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB Court) ఎదుట హైడ్రామా చేశారు. కోర్టు నుంచి బయటకు వస్తూ.. ఈ కేసులో తన తప్పేం లేదని, అయినా తనను ఇరికించారని వాపోయారు. తనకు మద్యం తాగే అలవాటు లేదు, అమ్మలేదని, అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ హల్ చల్ చేశారు. ఏదేమైనా తనను ఇందులో ఇరికించిన వారిని వదిలి పెట్టబోనన్నారు. పైన ఉన్న దేవుడు అన్నీ చూస్తున్నాడని, అంతా ఆయన చూసుకుంటాడంటూ పోలసు జీపులో వెళ్లిపోయారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో ధనుంజయరెడ్డి, గోవిందప్ప మినహా మిగతా 10 మందిని నేడు కోర్టులో హాజరు పరిచారు సిట్ అధికారులు. అనంతరం వారిని జైళ్లకు తరలించారు.

Next Story