90 రోజులు దాటిన జుడీషియల్ కస్టడీ.. కోర్టులో చెవిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్

by Vemula.Srinu Prasad |

లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు..

90 రోజులు దాటిన జుడీషియల్ కస్టడీ.. కోర్టులో చెవిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కాం కేసు(Liquor Scam Case)లో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Ycp Leader Chevireddy Bharskar reddy) అరెస్టయి.. జైలులో ఉన్న విషయం తెలిసిందే. 90 రోజులకు పైగా ఆయన రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. ఇంతకాలం బెయిల్ కోసం ప్రయత్నం చేసిన ఆయనకు నిరాశే ఎదురైంది. అయితే ఆయన జుడీషియల్ కస్టడీ 90 రోజులు దాటి పోవడంతో విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada Acb Court)లో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తును సాగదీస్తున్నారని, తనకు బెయిల్ రాకుండా ఉద్దేకపూర్వకంగా సిట్ అడ్డుకుంటుందని పిటిషన్‌లో దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి బెయిల్ మంజూరు చేయాలని ధర్మాసనాన్ని చెవిరెడ్డి కోరారు. ఇక చెవిరెడ్డి పిటిషన్‌పై కోర్టులో ఏం జరుగుతుందో చూడాలి.

Next Story