Cheetah: పంట పొలాల్లో చిరుత కలకలం.. చట్టుపక్కల గ్రామాల్లో అధికారుల దండోరా

by Kema Shiva Kumar |

అడవుల్లో ఉండాల్సిన చిరుత పులులు (Leopards) ఈ మధ్య కాలంలో జనావాసాల్లో విపరీతంగా సంచరిస్తున్నాయి.

Cheetah: పంట పొలాల్లో చిరుత కలకలం.. చట్టుపక్కల గ్రామాల్లో అధికారుల దండోరా
X

దిశ, వెబ్‌డెస్క్: అడవుల్లో ఉండాల్సిన చిరుత పులులు (Leopards) ఈ మధ్య కాలంలో జనావాసాల్లో విపరీతంగా సంచరిస్తున్నాయి. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న జిల్లాల్లో ఈ సమస్య సంబంధిత శాఖ అధికారులకు తలనొప్పిగా తయారైంది. ముఖ్యంగా అడవికి దగ్గరగా నివసించే రైతులకు చిరుత పులుల సంచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా, శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai Dist.) బుక్కపట్నం (Bukkapatnam) మండల పరిధిలోని కృష్ణాపురం (Krishnapuram), మారాల (Maarala) గ్రామ శివారు ప్రాంతాల్లోని పొలాల్లో చిరుత యథేచ్ఛగా సంచరిస్తోంది. అందుకు సంబంధించిన వీడియోలను స్థానిక యువకులు సెల్‌ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియా (Social Media)లో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని చుట్టుపక్కల గ్రామాల్లో అధికారులు దండోరా వేయిస్తున్నారు.

Next Story