బీచ్ రోడ్లో అక్రమాలపై.. వాస్తవాలు తేల్చండి

by Thanuru Gopichand |

విశాఖ బీచ్ రోడ్ లో కోస్తా నియంత్రణ మండలి (సీ ఆర్ జెడ్) నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

బీచ్ రోడ్లో అక్రమాలపై.. వాస్తవాలు తేల్చండి
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖ బీచ్ రోడ్ లో కోస్తా నియంత్రణ మండలి (సీ ఆర్ జెడ్) నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.విశాఖ బీచ్ రోడ్ లో కోస్తా నియంత్రణ మండలి (సీ ఆర్ జెడ్) నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు జరిగిన కబ్జాలు, అక్రమ కట్టడాలపై పరిశీలన జరిపి నివేదిక అందజేసేందుకు ఉన్నతాధికారుల కమిటీని హైకోర్టు నియమించింది. కోస్టల్ జోన్ రెగ్యులేటరీ అథారిటీ( సీ జెడ్ ఎంఏ) సభ్య కార్యదర్శి, విశాఖ జిల్లా కలెక్టర్, మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్లతో కూడిన ముగ్గురు అధికారుల బృందం వారం రోజుల్లో నివేదిక అందజేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. వైసీపీ మాజీ నేత పి.విజయసాయి రెడ్డి తన కుమార్తె నేహా రెడ్డి పేరిట భీమిలి బీచ్ రోడ్ లో ఇసుక తిన్నెలపై నిర్మించిన కట్టడాలను ఇప్పటికీ పూర్తిగా తొలగించకపోవడం పట్ల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ కట్టడాలపై విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై బుధవారం విచారణ జరిపిన ధర్మాసనం తామిచ్చిన తీర్పు మేరకు కట్టడాలను కూల్చకపోవటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.

భీమిలిలో పెద్ద ఎత్తున సీ ఆర్ జెడ్ ఉల్లంఘన జరుగుతున్నట్లు కొందరు మత్స్యకార నేతలు దాఖలు చేసిన పిటిషన్​ ను మూర్తి పిటీషన్​ తో కలిపి ధర్మాసనం విచారించింది. వాస్తవాలను రాబట్టేందుకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించింది. మూర్తి యాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది కే శ్రీనివాసమూర్తి వాదిస్తూ.. విశాఖ నుంచి భీమిలి వరకు పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరిగాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వీటన్నింటి పైన నివేదిక సమర్పించాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది. విజయసాయి రెడ్డి కుమార్ నేహా రెడ్డి కబ్జా విషయంలో సీ ఆర్ జెడ్ సర్వేయర్ నుంచి నివేదిక ఆలస్యం కావటంపై ధర్మాసను అసహనం వ్యక్తం చేసింది.

Next Story