ఆ ఆలయంలో ఈవో కొడుకు పెత్తనం.. దేవాదాయ శాఖ సీరియస్

by Gantepaka Srikanth |

అన్నవరం సత్యనారాయణ స్వామి(Annavaram Sathyanarayana Swamy) దేవాలయం(Devasthanam)లో మరోసారి గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఆ ఆలయంలో ఈవో కొడుకు పెత్తనం.. దేవాదాయ శాఖ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: అన్నవరం సత్యనారాయణ స్వామి(Annavaram Sathyanarayana Swamy) దేవాలయం(Devasthanam)లో మరోసారి గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ ఆలయంలో ఈవో కుమారుడి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఆలయ సిబ్బందితో పాటు భక్తులపై పెత్తనం చెలాయిస్తున్నాడని ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దీంతో ఆయన వ్యవహార శైలిపై దేవాదాయ శాఖకు ఆలయ సిబ్బంది కంప్లైంట్ చేశారు. ఈవో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుమారుడు చెలరేగిపోతున్నాడని, తరచూ తమను వేధిస్తున్నాడని దేవాదాయ శాఖ ఎదుట ఆలయ అధికారులు(Temple Authorities) వాపోయారు. దీనిపై వెంటనే స్పందించిన దేవాదాయ శాఖ కమిషనర్.. ఈవో కుమారుడి వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా చంద్రకుమార్‌ను నియమించారు. తనకు సమగ్ర నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై అన్నవరం దేవాలయం మరోసారి చర్చనీయాంశమైంది.

కాగా, ప్రొటోకాల్ ప్రకారం ఈవో(Executive Officer)కు అధికారాలు ఉన్నప్పటికీ దుర్వినియోగం చేసుకోకూడదని.. తన కుమారుడికి పెత్తనం ఇవ్వడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. ఈవోతో పాటు కుమారుడి మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆలయ ప్రతిష్టను భంగం కలగకుండా విధులు నిర్వహించాలని సూచనలు చేస్తున్నారు.

Next Story