- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సహకరిస్తే సరే.. అడ్డొస్తే తొక్కుకుంటూ ముందుకెళతా : చంద్రబాబు
by Seetharam |
రాజమండ్రి శివారు వేమగిరిలో జరుగుతోన్న టీడీపీ మహానాడు సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ,వెబ్‌డెస్క్: రాజమండ్రి శివారు వేమగిరిలో జరుగుతోన్న టీడీపీ మహానాడు సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉత్సాహం కనిపిస్తుందన్నారు. ఎన్నికల ప్రణాళికను ఈ సమావేశంలో ప్రకటించనున్నారు. టీడీపీలో మరింత జోష్ పెరిగిందన్నారు. సంపద పేదలకు పంచడం తెలిసిన పార్టీ టీడీపీనేనని చెప్పారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ నుంచి 15 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని భావి తరాలకు అందించాలన్నారు. కార్యకర్తల త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేనివని, వారిని పార్టీ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు చిరునామా టీడీపీ అని వ్యాఖ్యానించారు. సహకరిస్తే సరే అడ్డొస్తే తొక్కుకుంటూ ముందుకెళతామని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Next Story






