- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ OG సినిమాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని విజయవాడ వేదికగా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు రూ.436 కోట్లను అందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని విజయవాడ వేదికగా సీఎం చంద్రబాబు(Chandrababu) ప్రారంభించారు. లబ్ధిదారులకు రూ.436 కోట్లను అందించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలు ఉన్నాయి.. ఆటో డ్రైవర్లందరికీ రూ. 15 వేలు ఖాతాల్లో జమ చేశాం.. ఆటో డ్రైవర్లకు ఇది నిజమైన పండగ.. ఎవరూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. ఆన్‌లైన్‌లోనే డబ్బులు జమ అవుతాయి.. చెప్పినట్లు చేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని అన్నారు. గతంలో రోడ్ల పరిస్థితుల కారణంగా ఆటో డ్రైవర్ల ఆదాయం అంతా వాహనాల మరమ్మతులకే ఖర్చయ్యేది అని గుర్తుచేశారు. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా రోడ్లన్నీ అద్భుతంగా తయారయ్యాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రం మనదే అని చెప్పారు. రూ. 33 వేల కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వమే అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ మరింత పెరగాలి.. గత ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం.. వచ్చే ఎన్నికల్లో 100 శాతం సాధించాలని అన్నారు. దసరా పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ ఓజీ సినిమా(OG Movie) చూసారు, దసరా పండగ చేసుకున్నారు, విజయవాడ ఉత్సవం బాగా జరిగింది, ఇప్పుడు ఆటో డ్రైవర్ల పండగలో ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు.






