ఒకే సారి 175 అనే ఫార్ములాతో చంద్రబాబు.. సక్సెస్ రేటు ఎంతో..?

by Disha Web Desk 5 |
ఒకే సారి 175 అనే ఫార్ములాతో చంద్రబాబు.. సక్సెస్ రేటు ఎంతో..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎన్నికలకు రెండు నెలల సమయమే ఉండటంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు గెలుపు కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అధికార వైసీపీ వై నాట్ 175 పేరుతో ప్రచారం ముమ్మరం చేస్తూ.. జాబితాల వారిగా అభ్యర్ధులను ప్రకటిస్తూ వస్తొంది. ఈ నేపధ్యంలనే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకొని సీట్లను సర్ధుబాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సీట్ల సర్ధుబాటు కొలిక్కి వచ్చాక టికెట్ల ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే అభ్యర్ధుల ప్రకటన విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, విడతల వారిగా కాకుండా రాష్ట్రంలోని అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్ధులను ప్రకటించేలా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తొంది.

ఇప్పటికే వైసీపీ జాబితాల వారిగా ప్రకటిస్తుండగా, టికెట్ దక్కని కొందరు నేతలు పార్టీని వీడుతుండగా, దక్కుతుందనే క్లారిటీ లేక మరికొందరు లీడర్లు వేరే దారి చూసుకుంటూ.. పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వివాదాలకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. అందుకే విడతల వారిగా కాకుండా ఒకే సారి అభ్యర్ధులను ప్రకటిస్తే.. మిగతా ఆశావాహులకు నామినేటెడ్ పోస్టులపై హామీ ఇచ్చి, గెలుపుకు కృషి చేసేలా బుజ్జగించవచ్చనే యోచనలో ఉన్నారని తెలిసింది. ఈ ఫార్ములా ప్రకారం వెళితే పార్టీలో ఎక్కువ వివాదాలు తలెత్తకుండా ఉంటాయని అనుకుంటున్నట్లు సమాచారం.

పార్టీలో అంతర్గత వివాదాలు ముదరకుండా ఇప్పటినుంచే చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తొంది. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 15 నుంచి 20 మందికి టికెట్లు లేవని సమాచారం అందించారట. వీరు టికెట్లపై ఆశలు పెట్టుకొని నియోజకవర్గంలో తిరగడం వల్ల పార్టీకి అంతర్గతంగా నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. మరికొందరు నేతలకు నియోజకవర్గంలో పట్టు పెంచుకోవాలని సూచనలిస్తూ.. టికెట్ కన్ఫామ్ చేసినట్లు హింట్ ఇస్తున్నారని తెలసింది. పొత్తులో భాగంగా సీట్ల సర్ధుబాటు కొలిక్కి వచ్చింది అనుకునే లోపే బీజేపీ పొత్తు తెరపైకి రావడంతో టికెట్ల ప్రకటన వాయిదా వేసినట్లు తెలుస్తొంది. మరి చంద్రబాబు ఒకే సారి 175 ఫార్ములా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Read More..

‘నగరి’లో జబర్దస్త్ దోపిడీ.. మంత్రి రోజాపై షర్మిల సీరియస్ కామెంట్స్

Next Story

Most Viewed