- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TDP:‘చంద్రబాబు సార్.. మాదొక కోరిక’.. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలి
నేడు(జనవరి 18) విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ(TDP) వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్‌ఆర్ జిల్లా మైదుకూరులో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: నేడు(జనవరి 18) విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ(TDP) వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్‌ఆర్ జిల్లా మైదుకూరులో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు కడప విమానాశ్రయంలో జిల్లా నేతలు, అధికారులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. కడప(Kadapa) నుంచి హెలికాప్టర్‌లో ఆయన మైదుకూరు చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముందుకు అనూహ్య ప్రతిపాదన వచ్చింది. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి(Srinivas Reddy) సీఎం చంద్రబాబుకు సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. శ్రీనివాస్ రెడ్డి ప్రసంగిస్తూ.. ‘‘మాకు ఒక కోరిక ఉంది సార్! టీడీపీ ఆవిర్భవించిన 43 ఏళ్ల తర్వాత మూడో తరం నేతగా నారా లోకేష్(Minister Nara Lokesh) మన పార్టీలోకి వచ్చారు. భవిష్యత్తులో పార్టీకి భరోసా ఇవ్వాలన్నా, యువతకు భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం(Deputy CM)గా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాం’’ అంటూ వ్యాఖ్యానించారు.






