Chandrababu: రప్పా.. రప్పా నరికేస్తాం అంటే.. ఊరుకోవాలా..?

by Thanuru Gopichand |

ప్పా రప్పా.. నరికేస్తాం.. అంటే ఊరుకోవాలా అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

Chandrababu: రప్పా.. రప్పా నరికేస్తాం అంటే.. ఊరుకోవాలా..?
X

ఇలాంటి వెధవ పనులు చేసినందుకే 11 సీట్లు వచ్చాయి..

బెట్టింగ్​బ్యాచ్​లకు విగ్రహాలు పెడతారా..?

వైసీపీ వారు ప్రశ్నిస్తే.. తాట తీస్తాం..

సీఎం చంద్రబాబు నాయుడు

దిశ, డైనమిక్​ బ్యూరో : రప్పా రప్పా.. నరికేస్తాం.. అంటే ఊరుకోవాలా అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఒకప్పుడు రాజకీయాల్లోకి నేరస్తులను పక్కకు రానిచ్చేవారిమి కాదన్నారు. విచిత్రమైన మనస్తత్వాలు ఉండేవారు వైసీపీలో ఉన్నారని అన్నారు. ఈ రోజు ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇటువంటి ఒరవడి ఉందా అని ప్రశ్నించారు. ప్లకార్డులు పట్టుకుని చంపేయండి.. నరికేయండి అని అంటారా..? ఇటు వంటి వెధవ పనులు చేసినందుకే 11 సీట్లు ఇచ్చారని అన్నారు. నాయకులు ఒక పద్ధతి, హుందాతనం ఉండాలన్నారు. లిక్కర్​లో , ఇసుక మాఫియాలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. గంజాయి బ్యాచ్​, బెట్టింగ్​బ్యాచ్​కి విగ్రహాలు పెడు తున్నారని అన్నారు. హింసను ప్రోత్సహించి పోలీసులపై వేస్తున్నారని పేర్కొన్నారు. పర్యటన అనుమతులను జగన్​ఉల్లంఘించారని అన్నారు. మీ ఇంట్లో అమ్మయికి పెళ్లి చేయాలంటే అటు పదితరాలు, ఇటు పది తరాలు చూస్తామన్నారు. అటువంటిది ఒక నాయకుడిని ఎన్నుకునేటపుడు ఎందుకు చూడరని ప్రశ్నించారు. వితండవాదాలు వద్దన్నారు. సమాజాన్ని అతలాకుతలం చేస్తామంటే కుదరదన్నారు. ప్రజలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే వైసీపీ వారు అడిగితే తాట తీస్తామన్నారు. ఇలాంటివాళ్లు రోడ్డు మీదికి వస్తే భయంకర పరిస్థితులు వస్తాయని తెలిపారు.

Next Story