తెలంగాణ లీడర్లు అర్ధం చేసుకోవాలి.. CM చంద్రబాబు విజ్ఞప్తి

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-30 10:48:46  IST  )

తెలంగాణ లీడర్లకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు.

తెలంగాణ లీడర్లు అర్ధం చేసుకోవాలి.. CM చంద్రబాబు విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ లీడర్లకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) కీలక సూచనలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పోలవరం - బనకచర్ల ప్రాజెక్టు(Polavaram - Banakacharla Project) అత్యంత కీలకమని అన్నారు. ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరువు సమస్య ఉండదని చెప్పారు. దీనిని తెలంగాణ లీడర్లు కూడా అర్ధం చేసుకోవాలని కోరారు. నదుల అనుసంధానం తెలుగు రాష్ట్రాలకు అవసరం అని అభిప్రాయపడ్డారు. మంచి పనులు చేస్తుంటే కొందరు కావాలనే అడ్డుపడుతున్నారని.. ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. కుప్పం(Kuppam)లో రప్పా.. రప్పా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు.. కానీ ప్రజలు పులివెందుల, ఒంటిమిట్టలో కర్రుకాల్చి వాత పెట్టారని విమర్శించారు. కాగా, అంతకుముందు కుప్పం మండలంలోని పరమసముద్రం చెరువు వద్ద కృష్ణా నది జలాలకు చంద్రబాబు జలహారతి అర్పించారు. వైసీపీ హయాంలో గేట్లతో సెట్టింగ్‌లు వేసి నీళ్లు కూడా బయట నుంచి తీసుకొచ్చి నాటకాలు ఆడిన ఘటనలు చూశాం.. విమానం ఎక్కేలోపు నీళ్లన్నీ ఇంకిపోయిన పరిస్థితులను చూశాం. అసెంబ్లీలో చెప్పినట్లుగానే ఎవరు అడ్డుకున్నా.. హంద్రీనీవా ద్వారా నీళ్లు తీసుకొస్తామని చెప్పాం.. చేసి చూపిస్తున్నామని చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.

Next Story