- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OG సినిమా ఘన విజయం.. పవన్‌కు కంగ్రాట్స్ చెప్పిన చంద్రబాబు
గతకొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను సీఎం చంద్రబాబు(Chandrababu) పరామర్శించారు.

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను సీఎం చంద్రబాబు(Chandrababu) పరామర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వచ్చి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఓసీ సినిమా(OG Movie) విజయం సాధించడంతో శుభాకాంక్షలు చెప్పారు. త్వరగా కోలుకొని ప్రజా సేవలో నిమగ్నమవ్వాలని కోరారు. కాగా, పవన్ కల్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాశ్‌రాజ్, శ్రియారెడ్డి, శుభలేఖ సుధాకర్‌లు ఓజీ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ సంగీతం, రవి కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ, డీవీవీ దానయ్య నిర్మించారు. మరోవైపు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. తొలి మూడ్రోజుల్లోనే దాదాపు రూ.250 కోట్ల కలెక్షన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆదివారం సెలవుదినం కావడంతో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా సోమవారం నాటికి రూ.300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.






