అప్పుడు ప్రోత్సహించా.. ఇప్పుడు రాణిస్తోంది: భువనేశ్వరిపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-08 08:56:33  IST  )

3 దశాబ్ధాల క్రితం తాను హెరిటేజ్ కంపెనీని ప్రారంభించానని, ఆ బాధ్యతలను భార్య భువనేశ్వరికి అప్పగించానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు....

అప్పుడు ప్రోత్సహించా.. ఇప్పుడు రాణిస్తోంది:  భువనేశ్వరిపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: 3 దశాబ్ధాల క్రితం తాను హెరిటేజ్ కంపెనీ(Heritage Company)ని ప్రారంభించానని, ఆ బాధ్యతలను భార్య భువనేశ్వరి(Bhuvaneshwari)కి అప్పగించానని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అన్నారు. మొదట్లో ఆహె కాదన్నపప్పటికీ ఇప్పుడు మాత్రం వ్యాపార వేత్తగా రాణిస్తోందని ఆయన తెలిపారు. అమరావతిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో(International Women Day celebration) ఆయన మాట్లాడుతూ తన భార్యనూ, కోడలు బ్రాహ్మణిని పారిశ్రామిక వేత్తలుగా మార్చానని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఓ మహిళను పారిశ్రామిక వేత్తగా మార్చాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. స్వయం బ్రాండ్‌పైనే మహిళలు ఉత్పత్తులు తయారు చేయాలన్నారు. స్వయం బ్రాండ్‌ను మహిళలు ఉపయోగించుకోవాలని, తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. తమ ఆలోచనలతోనే ఈ బ్రాండ్‌ను ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

మహిళల భద్రత కోసం....

మహిళల భద్రత కోసం ఎలాంటి అడుగులైనా వస్తామని, రాజీపడమని చంద్రబాబు తెలిపారు. గత పాలకులు బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లను తయారు చేశారని మండిపడ్డారు. ఈ ముఠాల ఆటలను ఎట్టిపరిస్థితుల్లో సాగనివ్వమని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాష్ట్రంలో జనభా తగ్గుదల ఆందోళన కలిస్తోందని, పెరుగుదలకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చంద్రబాబు తెలిపారు.

Next Story