అత్యవసర నిధులు విడుదల చేయండి: దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు ఆదేశం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-23 14:59:07  IST  )

భారీ వర్ష ప్రభావిత జిల్లాలకు అత్యవసర నిధులు విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు..

అత్యవసర నిధులు విడుదల చేయండి: దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీన పడి తీరం దాటినప్పటికీ రాష్ట్రంపై ప్రభావం పడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందన్న సమచారాంతో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అప్రమత్తమయ్యారు. దుబాయ్ నుంచి మంత్రులకు కీలక ఆదేశాలు చేశారు.

భారీ వర్ష ప్రభావిత జిల్లాలకు అత్యవసర నిధులు విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన సంబంధిత మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, మిగతా వర్ష ప్రభావిత జిల్లాలకు రూ.1 కోటి చొప్పున అత్యవసర నిధులు మంజూరు చేయాలని సూచించారు. కడప, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలకు ఎస్డీఆర్ బృందాలను, నెల్లూరు జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణం మొహరించాలని కూడా సీఎం ఆదేశాలిచ్చారు. రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్దేశించారు.

Next Story