- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేసిన మంచిని చెప్పండి..పార్టీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
మంత్రులు, తమ పార్టీ ఎంపీలకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 23 నుండి పార్టీ నేతలు, ముఖ్యనేతలు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.

X
దిశ, వెబ్ డెస్క్: మంత్రులు, తమ పార్టీ ఎంపీలకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 23 నుండి పార్టీ నేతలు, ముఖ్యనేతలు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.ప్రజల్లోకి వెళ్లి ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను, సూపర్ 6 హామీలను దాదాపు అమలు చేశామనేది ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆదేశించారు. అమలు చేసిన ప్రతి హామీని ప్రజలకు వివరించాలని, చేసిన మంచిని చెప్పుకోవడంలో విఫలం కాకూడదని అన్నారు. పార్టీ సంస్థాగత కమిటీలను త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. యోగాంధ్ర ప్రభుత్వం కార్యక్రమం అయినా పార్టీ నేతలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఇప్పటి వరకు మొత్తం 2 కోట్ల మంది ప్రజలు యోగాంధ్రలో రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. ఆర్కే బీచ్ నుండి భోగాపురం వరకు అతిపెద్ద కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలిపారు.
Next Story






