మంత్రి పంపిన వీడియో చూసి హ్యాపీగా ఫీలైన చంద్రబాబు

by Gantepaka Srikanth |

ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ (పంప్ హౌస్) నుంచి 10 మోటార్ల ద్వారా శనివారం

మంత్రి పంపిన వీడియో చూసి హ్యాపీగా ఫీలైన చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ (పంప్ హౌస్) నుంచి 10 మోటార్ల ద్వారా శనివారం నీటిని హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలోకి పంపింగ్ చేశారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి రాగులపాడు పంప్ హౌస్ నుంచి 10 మోటార్లతో నీటి పంపింగ్ చేసేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu)కి మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) కృతజ్ఞతలు తెలియజేశారు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలో పుష్కలంగా వస్తున్న నీరు వస్తోందని, ఇందుకు చాలా ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు.

ఇందులో భాగంగా రాగులపాడు పంప్ హౌస్ నుంచి 10 మోటార్లతో నీటి పంపింగ్ జరిగే వీడియోని చంద్రబాబుకి మంత్రి కేశవ్ పంపించారు. మంత్రి పంపించిన వీడియోని చంద్రబాబు చూశారని.. పది మోటార్లతో నీటి పంపింగ్ జరగడం చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాకు ఇంత పెద్ద ఎత్తున నీరు తీసుకురావడం పట్ల తనకు కూడా సంతోషంగా ఉందని చంద్రబాబు తెలియజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపల ఆరు మోటర్ల నుంచి 12 మోటర్లకు వాడుకునేలా కాలువని రెండింతల సామర్థ్యానికి తీసుకువెళ్లడం జరిగిందని, ప్రస్తుతం కాలవలో రెండింతల సామర్థ్యంతో నీరు ప్రవహిస్తోందని, ఇందుకు సంతోషం వ్యక్తం చేశారు.

Next Story