- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్యాస్ కొరతపై చంద్రబాబు సమీక్ష.. సమావేశం మధ్యలో కేంద్రమంత్రికి ఫోన్
దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)కి మారినా కూడా వారికి ఇచ్చే రాయితీ సొమ్మును వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)కి మారినా కూడా వారికి ఇచ్చే రాయితీ సొమ్మును వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు సత్వరమే ఉత్తర్వులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. గల్ఫ్‌లో జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై సచివాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రాబోయే 6 నెలల్లో మొత్తం 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. శ్రీకాకుళం - కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పనుల్లో జాప్యంపై సీఎం అధికారుల వివరణ కోరారు. దీనికి సంబంధించి కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అధికారులు చెప్పడంతో సమీక్షా సమావేశం నుంచే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఫోన్ చేశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అయినందున వెంటనే పనులు పూర్తి చేసేలా చూడాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.






