- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకున్న చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన కుప్పం నియోజకవర్గంలోని 250 కుటుంబాలను దత్తత తీసుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన కుప్పం నియోజకవర్గంలోని 250 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక P4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్) కార్యక్రమంలో భాగంగా తాను కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుంటానని సీఎం చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు. ఈ దత్తత ప్రక్రియకు సూచనగా ఆయా 250 కుటుంబాలకు "అడాప్ట్ ట్రీ"ని అందించారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన ఈ కుటుంబాలను "బంగారు కుటుంబాలు"గా పిలుస్తూ, వారి సమగ్ర అభివృద్ధికి బాధ్యత తీసుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ దత్తత కార్యక్రమం ఆగస్టు 15 నుండి మొదలవగా.. సమాజంలోని ధనవంతులు, వ్యాపారవేత్తలు ఇందులో భాగం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
Next Story






