- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nara Chandrababu Naidu : నారా చంద్రబాబు అనే నేను..
చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారాయన.

ఆ తొలి ప్రమాణ స్వీకారానికి ముప్ఫై ఏళ్లు..
ముఖ్యమంత్రి పీఠం తొలిసారిగా అదిష్టించిన రోజది..
తెలుగు రాష్ట్రాల్లో నాలుగుసార్లు సీఎంగా చేసిన అరుదైన ఘనత
అభినందనలు తెలుపుతున్న టీడీపీ నేతలు
సుదీర్ఘ అనుభవాలను గుర్తు చేసుకుంటున్న శ్రేణులు
ట్రెండింగ్‌లో #30YearsSinceCBNbecameCM హాష్ ట్యాగ్
దిశ, డైనమిక్ బ్యూరో : చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారాయన.. అంచెలంచెలుగా ఎదిగి దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగారు. నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రస్థానంలో ఓ కీలక మైలురాయికి చేరుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి నేటికి (సెప్టెంబరు 1) 30 ఏళ్లు పూర్తయింది. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆయన ప్రస్తు తం నాలుగోసారి సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ నాటి నుంచి రాజకీయాల్లో ఎన్నో కష్టాలు, నష్టాలు, అపోహలు అవరోధాలను ఎదుర్కొని తెలుగు జాతి ఉన్నతి కోసం శ్రమించిన మహోన్నత నాయకుడు ఆయన అని టీడీపీ నేతలు కొనియాడుతున్నారు. 1994 ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించిన తర్వాత పార్టీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు నాయుడు శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆ క్రమంలో 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిపాలనలో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రజల వద్దకే పాలన, జన్మభూమి, శ్రమదానం వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేశారు.
టెక్నాలజీ అంటేనే బాబు..
సాంకేతికతపై ఆయనకున్న ముందుచూపుతో హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణానికి పునాదులు వేశారు. ఇది ఐటీ రంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టింది. ప్రతి సందర్భంలోనూ ఆయన ఈ విషయాన్ని గుర్తు చేస్తుంటారు. అదే తీరుగా అమరావతిని కూడా తీర్చిదిద్దాలని తపన పడుతున్నారు. ఏపీని పునర్మించాలని తాను సంకల్పించినట్లు చెబుతుంటారు. రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో, ఇద్దరు ప్రధానుల ఎంపికలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించడంలోనూ చంద్రబాబు ముఖ్యపాత్ర వహించారు.
పదేళ్లు ప్రతిపక్ష నేతగా..
2004, 2009 ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ఆ సమయంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ, పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం, 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘన విజయంతో నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ప్రస్తుతం నవ్యాంధ్ర పునర్నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకుని ముందుకు సాగుతున్నారు.
ట్రెండింగ్‌లో చంద్రబాబు..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ శుభ పరిణామాన్ని మరోసారి గుర్తు చేసుకుంటు టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఎక్స్(ట్విట్టర్)లో #30YearsSinceCBNbecameCM అనే హాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
చంద్రబాబు దూరదృష్టి స్ఫూర్తిదాయకం
అభివృద్ధిపై మీ అంకితభావం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది అని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు అయిన సందర్భంగా ఆయన శుభా కాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని సమగ్రంగా తీర్చిదిద్దాలన్న మీ దూరదృష్టి భావితరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నట్లు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు నేల పై నాలుగు సార్లు సీఎంగా పనిచేసిన ఏకైక సీఎం చంద్రబాబు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అనేక సంక్షోభాలను పరిష్కరించిన అపర చాణిక్యుడు అని కొనియాడారు. చంద్రబాబు పాలన తెలుగు రాష్ట్రాలకు స్వర్ణ యుగం అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 15 ఏళ్ల కాలంలో అనేక సంక్షోభావాలను పరిష్కరించిన నేత అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని మంత్రి ఆనం అన్నారు.
Also Read..






