Ap News: సీఎం జగన్‌కు అది పగటికలే...!

by Disha Web Desk 16 |
Ap News: సీఎం జగన్‌కు అది పగటికలే...!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రాన్ని విధ్వంసం చేసేందుకే పుట్టినట్లు సీఎం జగన్ వైఖరి ఉందని చంద్రబాబు విమర్శించారు. జగన్ భవిష్యత్తు ఏందో ప్రజలకు అర్ధమైందని ఎద్దేవా చేశారు. గతంలో మంచి, చెడులపై విశ్లేషణ ఉండేదని ఆయన తెలిపారు. వైసీపీ పాలనలో ఎదురు దాడి తప్ప మరొకటి లేదన్నారు. ముందస్తుకు తాము సిద్ధంగా లేమని జగన్ అనుకుంటే అది పగటికలేనని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా తాము సిద్ధమని ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్‌కు షాక్ ఇచ్చింది ప్రజలేనని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు శాశ్వత చికిత్స చేస్తారని ఎద్దేవా చేశారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేసే విషయం ఎందుకు చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. 175 స్థానాల్లో వైసీపీని ఓడించడమే తమ టార్గెట్ అని చెప్పారు. తమ నలుగురి ఎమ్మెల్యేల బలంతోనే ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకున్నారని వ్యాఖ్యానించారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చంద్రబాబు తెలిపారు. వైసీపీలో నేతలు బానిసల్లా బతుకుతున్నారని చెప్పారు.


Next Story