- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా మిత్రుడు పవన్ నేను చాలా అవమానాలు పడ్డాం: చంద్రబాబు
ఎమర్జెన్సీపై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఓ కేస్ స్టడీ అయితే పాలకులు ఎలా ఉండకూడదో అనడానికి జగన్ ఓ కేస్ స్టడీ అని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఎమర్జెన్సీపై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఓ కేస్ స్టడీ అయితే పాలకులు ఎలా ఉండకూడదో అనడానికి జగన్ ఓ కేస్ స్టడీ అని అన్నారు. తన జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ జగన్ లాంటి వ్యక్తిని చూడలేదని చెప్పారు. అన్యాయం, అక్రమాలు, అవినీతి, ప్రశ్నించే గొంతును నిలిపేయడం, భూకబ్జాలు, మోసాలు, బెదిరింపులు, దాడులు, రౌడీయిజం ఇలా ఒకటి కాదు చాలా జరిగాయని అన్నారు.
ఓ డాక్టర్ మాస్క్ అడిగినందుకు ఆయనను వేధించి వేధించి గత ప్రభుత్వం పిచ్చివాడిని చేసి నడి రోడ్డుపై చంపేసే స్థితికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కూడా చాలా సమస్యలు వచ్చాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తనకు ఏమైనా పర్వాలేదు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఏకైక ధ్యేయంతో ముందుకు వెళ్లానని అన్నారు. అదే సమయంలో మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా అవమానాలు పడ్డారని తెలిపారు. ఆయన కూడా ఒకటే ఆలోచించారని అన్నారు. ఎట్టిపరిస్థితిలో రాష్ట్రాన్ని కాపాడుకోవాలనుకున్నారని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ కూడా ముందుకు వచ్చిందని అందరం కలిసి పోరాడమన్నారు. ఒక్క ఏడాదిలోనే సుపరిపాలనతో తొలి అడుగువేశామని చెప్పారు.






