- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల వేళ APSRTC ఎండీకి చంద్రబాబు ఫోన్.. ఎందుకంటే..?
మరికొన్ని గంటల్లో పోలింగ్ మొదలు కానున్న వేళ ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమలరావుకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మరికొన్ని గంటల్లో పోలింగ్ మొదలు కానున్న వేళ ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమలరావుకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు వస్తోన్న ఓటర్లకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీని చంద్రబాబు కోరారు. పట్టణాల నుండి జిల్లా ప్రాంతాలకు అదనంగా బస్సులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటు వేసేందుకు వస్తోన్న ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పోలింగ్‌కు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ సీట్లుకు ఎన్నికలు జరగనున్నాయి.
Read More..






