- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయసాయిరెడ్డి రాజీనామాకు ఆమోదం.. బులిటెన్ విడుదల చేసిన రాజ్యసభ
Chairman Rajya Sabha accepted the resignation of Vijaysai Reddy

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ(YCP) నేత విజయసాయి రెడ్డి(Vijaysai Reddy) రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్(Rajya Sabha Chairman Jagdeep Dhankhar) ఆమోదించారు. ఈ మేరకు శనివారం రాజీనామాపై బులిటెన్ విడుదల చేశారు. విజయసాయి రాజీనామాతో ఆంధ్రప్రదేశ్‌లో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. మరోవైపు.. వైసీపీ అధినేత జగన్(Jagan)కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. మొత్తం రాజకీయాలకే దూరంగా ఉంటానని.. మరో పార్టీలో చేరబోనని ఆయన చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అసలు ఆయనకేం అయింది.. ఇంత సడన్‌గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని పార్టీ శ్రేణులు చర్చలు చేస్తున్నారు.
రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పలువురు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డిని కోరిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించడంతో ఇప్పుడు వెనక్కి తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కాగా, శనివారం ఉదయమే ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ నివాసానికి వెళ్లి విజయసాయిరెడ్డి తన రాజీనామా లేఖ సమర్పించారు. కొద్ది గంటలకే చైర్మన్ విజయసాయి రెడ్డి రాజీనామాను ఆమోదించారు. విజయసాయి రెడ్డి రాజీనామా విషయం జగన్‌కు తెలియకుండానే జరిగిందన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే జగన్ స్పందిస్తే గాని తెలియదు.






